Take a fresh look at your lifestyle.

అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య……

0 1,511

అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 21( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలో జెట్టి సాయిబాబా తన కూతురి పెళ్లికి అయిన అప్పులు తీరక,మద్యం కు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం బాల్కొండలో చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించి బాల్కొండ ఎస్సై బి నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పోచమ్మ గల్లికి చెందిన జెట్టి సాయిబాబా (48) అనే వ్యక్తి 2021లో తన కూతురుకు పెళ్లి చేయగా,అప్పుల విషయంలో తరచూ భార్యతో గొడవ పడుతూ, మద్యం తాగుటకు బానిసయ్యాడు.ఇదే విషయంలో ఈ నెల 20న మద్యంతాగి ఉదయం భార్యతో గొడవపడి రాత్రి సమయంలో ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుని కొడుకు సాయికిరణ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బీ నరేష్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.