ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి
– నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

కామారెడ్డి జిల్లా, ఆగస్ట్ 05( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎస్సీ వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా అనే నినాదాలు తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వర్గీకరణ ఉప సంహరించుకోవాలని వినతి పత్రం అందజేసారు. మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు కన్వీనర్లు మీసాల సత్యం, సంఘీ రాజలింగం, ఆర్గనైజర్ కార్యదర్శులు ఎడ్ల రాజు, సుతారి సుధాకర్, కోశాధికారి తలారి బాలరాజు, పెరుమాండ్ల రాజ నర్సింలు మాట్లాడుతు… సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరాకరిస్తూ సోమవారం రోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలని వినతి పత్రం అందజేసారు. 341 ఆర్థికల్ ను మార్చి ఎస్సీ , ఎస్టీల జనాభా ప్రతిపాదన చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజించడం సరి కాదని, నరేంద్ర మోడీ కేవలం కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి మాత్రమే నరేంద్ర మోడీ పంతం కట్టాడని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ను ఉప సంహరించుకోవాలని, లేనియెడల పెద్ద ఎత్తున మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు ప్రతి గ్రామము నుండి మాల బంధువులకు పిలుపునిచ్చి రోడ్డులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. అప్పటివరకు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు వివిధ గ్రామాల మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.