నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

రామారెడ్డి, ఆగస్టు 24 (లోకంతీరు) : రామరెడ్డి మండల నాయకుడు టిఆర్ఎస్ పార్టీ సీనియర్
నాయకులు పడిగేలా శ్రీనివాస్ పెద్దన్న కూతురు పెళ్లికి కామారెడ్డి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగే వివాహ మహోత్సవానికి హాజరైన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనంతరం వధువు వరులను ఆశీర్వదించారు. పలు గ్రామాల కార్యకర్తలు ను కలిసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు రామరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పడగల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు పాల మల్లేశ్, రాజనర్స్, నర్సారెడ్డి, స్వామి, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.