బీంగల్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31( లోకంతీరు) : బీంగల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు, బోయగల్లి శ్రీనివాస్ ఇంట్లో మంగళవారం రాత్రి కుటుంబీకులంతా ఓ గదిలో నిద్రిస్తుండగా ఆ గదికి గడియ పెట్టి మరో గదిలోకి చొరబడ్డ దుండగులు 3.4తులాల బంగారం, 45తులాల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు