Take a fresh look at your lifestyle.

విద్యార్దులు ఉన్నత స్థానంలో నిలవాలి….

0 1,169

విద్యార్దులు ఉన్నత స్థానంలో నిలవాలి

– కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఇష్టపడి పట్టుదలతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం సదాశివనగర్ ఆదర్శ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యను చదవాలని సూచించారు. హాస్టల్ లో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పాఠశాలలో నడుస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సదాశివ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బీసీ వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వార్డెన్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, తహసిల్దార్ గంగాసాగర్, ఎంపీడీవో సంతోష్, ఎంఈఓ యోసేఫ్, వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్, అధ్యాపకులు భానుమతి, రాజశేఖర్, లింగమయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.