బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశానికి బయలు దేరిన కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు.

కోటగిరి, జనవరి 25 (లోకం తీరు):-హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశానికి కోటగిరి మండల కాంగ్రెస్ కార్యకర్తలు గురు వారం ఉదయం బయలు దేరారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సే న్ పార్టీ జెండాను ఊపి వాహనాన్నీ ప్రారంభించారు.ఈ సమావేశానికి బయలుదేరిన వారిలో నిజామాబాద్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు వహీద్ భాయ్,మండల కిసాన్ కేత్ అధ్యక్షులు గర్దాస్ ఆనంద్,నాయకులు ఎత్తోండ అబ్బయ్య,అహ్మద్ భాయ్,హైమద్,సాయిలు,తదితరులు ఉన్నారు