మానసిక ఉల్లాసానికి విద్యార్థులకు క్రీడలు ఎంతో దోహపడతాయి
కామారెడ్డి జిల్లా /సదాశివ నగర్, ఆగస్టు 29 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ ఆదర్శ పాఠశాలలో మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ప్రిన్సిపాల్ రాజేందర్ అన్నారు. మానసిక ఉల్లాసానికి విద్యార్థులకు క్రీడలు ఎంతో దోహదపడతాయని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని నేటి సమాజంలో విద్యార్థులకు క్రీడలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆదర్శ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన తెలుగు భాష ద్వారానే ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చని ఇతర ఎన్ని భాషలు నేర్చుకున్న, మన తెలుగు భాషను నిర్లక్ష్యం చేయవద్దని విద్యార్థులకు భాషా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భానుమతి, రాజశేఖర్, చిత్ర, లింగమయ్య, దశరథ్, విద్యారమణ, అనిత శర్మ, నీరజ, జిజియా, తెలుగు ఉపాధ్యాయులు నాగలక్ష్మి , నవీన్ రావ్, అభిలాష్, ఫిజికల్ డైరెక్టర్ ప్రవీణ్ లు పాల్గొన్నారు.