27న బాల్కొండలో తలపెట్టిన బిజెపి కొమురం భీమ్ విజయ సంకల్ప రథ యాత్ర ను విజయవంతం చేయండి – ఎంపీ అర్వింద్
-
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కి మద్దతు తెలిపి బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించండి – ఎంపీ అర్వింద్

బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ స్థాయి కొమురం భీమ్ రథ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్,,జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, నియోజకవర్గ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి.
ఈ సందర్భంగా భీంగల్ ,మోర్తాడ్ మండలాలకు చెందిన పలువురు పార్టీలో జాయిన్ అయ్యారు వారికీ ఎంపి అరవింద్ పార్టీ కండువా కప్పి సాదరం గా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు..
ఎంపి కామెంట్..
25సంవత్సరాలుగా స్పైస్ బోర్డ్ పై ఉద్యమం జరిగితే చంద్ర మండలము నుండి భూమండలము వరకూ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మారు మ్రోగింది. అలాంటి లీడర్ మోడి నిజమాబాద్ లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేశారన్నారు. ఈ పసుపు బోర్డ్ మూలంగానే ఈ రొజు పసుపుకు 13000 మద్దతు ధర పలీకి రైతు సంతోషం గా ఉన్నారన్నారు.
ఇతర రాష్ట్ర లలో వున్న ఎంపి సభ్యులూ బీజీపీ కండువా కప్పుకునెందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసింది ఎందుకూ కాంగ్రెస్ ను గెలిపించే ది ఎందుకూ ఆని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు అని అన్నారు.
అరవింద్ ఎప్పుడూ ఇతరుల డబ్బులు తినలేదు. కానీ చరిత్ర తిరగ రాసెందుకు ప్రదాని నరేంద్ర మోదీ గారిని జిల్లాకు తీసుకొచ్చి బోర్డ్ ప్రకటించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అవినీతి చిట్టా తనకు తెలుసన్నారు. నాది అహంకారి తత్వం కాదు కాంగ్రెస్ వాళ్లది అహంకారి నైజం అని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు చేతనైతే పసుపు రీసెర్చ్ సెంటర్ లూ పెట్టండి వ్యాపారులకు ల్యాండ్ అలాట్ మెంట్ చెయ్యండి అని అన్నారు. పసుపు ధర పెరగడం వల్ల బీజీపీ కి మంచిపేరు రావడం ఓర్వ లేక పసుపు విస్తిర్ణత తగ్గింది కావున ధర పెరిగిందని ఆరోపిస్తున్నారు ..కానీ విస్తిర్ణత పెరిగింది కానీ తగ్గలేదన్నరు. కాంగ్రెస్ అధికారంలో కి వచ్చీ మూడునెలలు కావస్తున్న వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంక సరిగా అమలు కావటం లేదన్నారు. యాడాది కింద కాంగ్రెస్ పార్టిలో డిపాజిట్ లు కుడా దిక్కు లేదు కానీ మా పార్టీలో సరైన సఖ్యత లేఖ కాంగ్రెస్ అధికారంలో కి వచ్చింది. ఎర్ర జొన్న ల వ్యాపారులు కాంగ్రెస్ పార్టీ వల్లనే సిండికేట్ అయ్యారాన్నరు. 53 ఫ్యాక్టరీలు రీ ఓపెనింగ్ చేయించిన ఘనత నరేంద్ర మోడీ దన్నరు. రానున్న రోజుల్లో దేశంలో 400 సీట్లతో బీజేపి ప్రభుత్వము అధికారంలో కి రాబోతున్నది అన్నారు. పవర్ కట్ వుందంటే అక్కడ కాంగ్రెస్ గవర్న మెంట్ వుందని చెప్పవచ్చని విమర్శించారు. రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నరు కేవలం 200యూనిట్ ల కరెంటే ఇచ్చే టట్లు వున్నారని విమర్శించారు. బీజేపి, బీఆర్ఎస్ అలయన్స్ అని మైనార్టి ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నరని అన్నారు. వేల్పుర్ మండల కేంద్రంలోని 35 ఎకరాల స్పైస్ బోర్డు స్థలం కేంద్ర పసుపు బోర్డుకు అప్పగించాలన్నారు.
ఈ నెల 27న తల పెట్టిన కొమురం భీం బస్సు యాత్ర ను విజయ వంతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారు, పార్లమెంట్ కన్వీనర్ గద్దే భూమన్న, పార్లమెంట్ ప్రభారీ వెంకటరమణి, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, అన్ని మండలాల అధ్యక్షులు బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.