Take a fresh look at your lifestyle.

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శ…..

0 1,273

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శ

కామారెడ్డి జిల్లా/ సదాశివనగర్ , సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన జర్నలిస్టు బిక్కనూరు సాయిలు పెద్ద అత్తమ్మ జంగంగారి రాజవ్వ అనారోగ్యానికి గురై కామారెడ్డి ప్రభుత్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సదాశివ నగర్ మాజీ జడ్పిటిసి పడిగెల రాజేశ్వర్ రావు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాజవ్వ కుమారుడు జంగంగారి పెద్ద సాయిలు ను వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజవ్వకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో పోసానిపెట్ రైతుబంధు మాజీ అధ్యక్షుడు చాకలి తిరుపతి, జిల్లా గిరిజన నాయకుడు లింబాద్రి నాయక్, వెంకటరమణ, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.