Take a fresh look at your lifestyle.

మండల కేంద్రంలో సాంస్కృతిక కళాజాత అవగాహన సదస్సు…

0 1,379

మండల కేంద్రంలో సాంస్కృతిక కళాజాత అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు, డిపిఆర్ఓ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా 6 గ్యారంటీలు ప్రభుత్వ పథకాలపై, రైతు రుణమాఫీ, గృహజ్యోతి, వివిధ పథకాలపై ప్రజలకు పాటల, మాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సారధి కళాకారులు రమేష్ రావు, మహేందర్, ఐండ్ల రాము, విట్టల్ రెడ్డి, నాగరాజు, దివ్య, ప్రశాంత్ రెడ్డి, గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.