Take a fresh look at your lifestyle.

ఏడవ జాతీయ పోషణ దినోత్సవం….

0 1,311

ఏడవ జాతీయ పోషణ దినోత్సవం

 – విద్యార్థులకు వైద్య పరీక్షలు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 12 ( లోకంతీరు ) : మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసంలో భాగంగా కే.జీ. బీ.వీ. టెక్రియల్, జెడ్.పి.హెచ్.ఎస్. టేక్రియల్ పాఠశాలల విద్యార్థులకీ రక్తహీనత పరీక్ష శిబిరం గురువారం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే విధంగా కలెక్టర్ మాట్లాడుతూ కిషోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని పాఠశాలలో కిషోర బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 363 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, వైస్ చైర్మన్ అనిత, బి డబ్ల్యు బావయ్య డిఎంహెచ్వో చంద్రశేఖర్, డి.ఈ.ఓ రాజు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.