మాజీ ఎమ్మెల్యే ను కలిసిన సీనియర్ నాయకులు

రామారెడ్డి ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.మండలంలోని సమస్యలను మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కల్పించాలని, గతంలోనీ కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాదీ ముబారక్, రైతు బీమా కు సంబంధించిన లబ్ధిదారులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల మల్లేష్, కే రాజయ్య, జే ఎల్లయ్య, జే ఆదిరెడ్డి, యం భూమయ్య, నారాయణ, కే సుమన్, ఎం ప్రభాకర్, రాజ మల్లన్న, మల్లయ్య, లింగం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.