ఎల్లారెడ్డి మండల ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి, ఆగస్టు 28( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ మండల అధ్యక్షులుగా మంత్రి వెంకటయ్య , ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రాథోడ్, కోశాధికారిగా ఎస్ సాయిలు, ఉపాధ్యక్షులుగా శివలింగం, నౌషా, సాయిలు, సంగియా, కార్యదర్శులుగా మాన్య ,శివరాములు, అనితదేవిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయ సమస్యల కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని, సంఘ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.