Take a fresh look at your lifestyle.

రాజంపేట మండలంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

0 1,559

రాజంపేట మండలంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 24 ( లోకంతీరు ) : రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు సరియైన మందులు అందించి, చికిత్స చేయాలన్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తహసిల్దార్ కేంద్రాన్ని, నర్సరీని పర్యవేక్షించారు. అనంతరం కెజిబివి పాఠశాల ను తనిఖీ చేసి విద్యార్థుల యెక్క ఆట పాటలను, నృత్యాలను అలరించారు. విద్యార్థుల కు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల ఎంపిడిఓ, ఎంపిఓ, కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ కు కలుపు మొక్కలు తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మండల తహసిల్దార్, ఎంపిడిఓ, ఎంపీఓ, కార్యదర్శి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.