Take a fresh look at your lifestyle.

హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ కార్యాలయం ప్రారంభం…

0 1,242

హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15 ( లోకంతీరు ) : రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఉమెన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ అనుబంధ కార్యాలయంను, కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాందీపని జూనియర్ కాలేజ్ శ్రీకృష్ణ ధ్యాన మందిర్ అశోక్ నగర్లో ఆదివారం హ్యూమన్ రైట్స్ కామారెడ్డి జిల్లా మహిళా కోఆర్డినేటర్ దొమ్మాటి లలిత తల్లిదండ్రులు యాదమ్మ – నర్సయ్య చేతుల మీదుగా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దొమ్మాటి లలిత మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సామాన్యులపై అక్రమాలు, మహిళలు, వృద్ధులు చిన్నారులు, అభాగ్యులపై అన్యాలను ఎదిరించడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఉమెన్ రైట్స్ సెల్ఫ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖలీల్ హుల్ల, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ముదం శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్, తెలంగాణ మాదిగ హక్కుల పోరాట సమితి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు రూప్ సింగ్, బట్టు శ్రీనివాస్, నంద కుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి సమాచారం కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7671984970లో సంప్రదించాలని దొమ్మాటి లలిత జిల్లా ప్రజలను కోరారు.

Leave A Reply

Your email address will not be published.