Take a fresh look at your lifestyle.

పెరిక కార్పొరేషన్ కు 10 వేల కోట్ల నిధులు కేటాయించాలి…

0 1,608

పెరిక కార్పొరేషన్ కు 10 వేల కోట్ల నిధులు కేటాయించాలి

– పెరిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిన్నం రామచంద్రం

కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : రాష్ట్ర ప్రభుత్వం పెరిక కార్పొరేషన్ కు పదివేల కోట్ల నిధులను కేటాయించాలని పెరిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిన్నం రామచంద్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెరిక కులస్తులను గుర్తించి వారికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలైన పెరిక కులస్తుల ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. పెరిక కులస్తుల కులవృత్తి లేక వివిధ పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని ఈ విషయమై ప్రభుత్వం పెద్ద మనసుతో నిధులు కేటాయించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.