ధరణి సమస్యలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలి..!
– భూ తగాదాలకు ఎక్కడ తావు ఇవ్వొద్దు
– కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి,జిల్లా ప్రతినిధి , మార్చి 11 ( లోకంతీరు ) : ధరణిలో రైతుల సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఎలాంటి భూ తగాదాలకు తావు ఇవ్వద్దని కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకట రమణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు . సోమవారం నాడు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఆర్డీవో ఎంఆర్ఓ ల తో కామారెడ్డి క్యాంపు కార్యాలయములో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమావేశమై ఆర్డీవో తహసిల్దార్లకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గం లో ఎలాంటి భు తగాదాలకు తావు ఇవ్వొద్దని, ధరణి సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.