మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ మరియు డైరెక్టర్ కు ఘన సన్మానం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 24 (లోకంతీరు) : బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో,వేల్పూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా కొత్తింటి ముత్యం రెడ్డి ను డైరెక్టర్ పబ్బ రాజేష్ ను వన్నెల్ బీ కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ నాగులాపల్లి కిషన్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఎల్లన్నగారి చిన్న దేవేందర్,గోజుర్ సంతోష్, పర్షపు రఘపతి,రాజ్ పాల్,గాదెపల్లి రాజేందర్,పుర్రె రాజేందర్, లింబాద్రి, గొవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.