Take a fresh look at your lifestyle.

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ….

0 1,321

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ


ఎల్లారెడ్డి, అక్టోబర్ 8  ( లోకంతీరు ) : 
ఎల్లారెడ్డి మండల పరిధిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటు నుంచి వస్తున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు సహాయం చేసి ఆసుపత్రికి పంపించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధానరహదారి పక్కన హాజీపూర్ తండా సమీపంలో ఓద్విచక్ర వాహనం ఎల్లారెడ్డి నుంచి లింగంపేట్ వైపు వెళ్తున్న అదుపు తప్పి ప్రమాదవశాత్తు పొదల్లో పడిపోవడంతో ద్విచక్ర వాహదారునికి తీవ్రగాయాలు అయ్యాయి. అటునుంచి వస్తున్న డీఎస్పీ కావ్వాయి అపి స్వయంగా క్షతగాత్రునికి ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న వాహనదారులు, స్థానికులు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు స్వయంగా గాయపడిన వారికి సహాయం చేయడంతో పలువురు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.