Take a fresh look at your lifestyle.

డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలి…

0 1,797

డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలి

  •   రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కి వినతి

నిజామాబాద్, ఫిబ్రవరి 1 ( లోకం తీరు  ) : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న డీఎస్సీ నియామకం కంటే ముందు టెట్ రాత పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర చాత్రోపాధ్యాయుల సంఘం మరియు PDSU విద్యార్థి సంఘంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి. వెంకటేశం  మరియు పాఠశాల విద్య కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చాత్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిజామాబాద్ డైట్ కళాశాల PDSU అధ్యక్షులు జే. తరుణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నియామకం చేపట్టకంటే ముందు మొదటగా టెట్ పరీక్ష నిర్వహణ చేపట్టాలని కోరారు. దానివలన చాలామంది నిరుద్యోగులకు డీఎస్సీ రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహిస్తే,ఎవరైతే ఇప్పుడు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నిజామాబాద్ డైట్ కళాశాల ప్రధాన కార్యదర్శి ఏ. అరవింద్, సహాయ కార్యదర్శి మహేష్, రాష్ట్ర ఛాత్రోపాధ్యాయుల సంఘం సహాయ కార్యదర్శి సాయి తేజ, జేశన్, ప్రశాంత్, సద్విక్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.