సీఈఆర్ క్లబ్ ఎన్నికల్లో ఎస్‌సీఎంఎల్‌యూ–ఐఎన్‌టీయూసీ ప్యానెల్ ఘన విజయం.
భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికలు.. విజేతలకు జనక్ ప్రసాద్, మధుకర్ రెడ్డి అభినందనలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 12: సింగరేణి భూపాలపల్లి ఏరియా సీఈఆర్ క్లబ్ ఎన్నికల్లో ఎస్‌సీఎంఎల్‌యూ–ఐఎన్‌టీయూసీ మద్దతు ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఆదివారం భూపాలపల్లి స్థానిక సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో క్రీడాకారుల మద్దతుతో ఐఎన్‌టీయూసీ ప్యానెల్ కీలక పదవులను కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది.
సీఈఆర్ క్లబ్ కమిటీ ఎన్నికలను యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, జేబీసీసీఐ-11 స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌సీఎంఎల్‌యూ–ఐఎన్‌టీయూసీ ప్యానెల్ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో క్రీడాకారులు ఎస్‌సీఎంఎల్‌యూ–ఐఎన్‌టీయూసీ ప్యానెల్‌కు ఏకపక్షంగా మద్దతు తెలపడంతో ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించారు.
విజేతల వివరాలు:
- కార్యదర్శి: కాపు చంద్రశేఖర్ (ఫిట్టర్, ఓసీ-2)
- ఆర్గనైజింగ్ కార్యదర్శులు: యు. శ్రీనివాస్ (చైన్‌మెన్, సర్వే), మధిర కొమురయ్య (జనరల్ అసిస్టెంట్, ఓసీ-2)
- స్పోర్ట్స్ కెప్టెన్: పాక శ్రీనివాస్ (కోల్ కట్టర్, కేటీకే-8)
- కల్చరల్ కెప్టెన్: అడిచెర్ల శ్రీనివాస్ (జనరల్ అసిస్టెంట్, కేటీకే-1)
- కార్యవర్గ సభ్యులు: ఆర్. శ్రీకాంత్ (కోల్ కట్టర్, కేటీకే-5), ఎన్. చిరంజీవి (టెండాల్ కేటీకే-6), ఎం.డి. తాజుద్దీన్ (జనరల్ అసిస్టెంట్ కేటీకే-8), జి. శ్రీనివాస్ (జనరల్ అసిస్టెంట్, కేటీకే-1
ఎన్నికల విజయానంతరం ఐఎన్‌టీయూసీ నాయకులు విజేతలను ఘనంగా అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన భూపాలపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎ. రఘుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు, జనరల్ సెక్రటరీ పసునూటి రాజేందర్, భూపాలపల్లి మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్, ఏరియా స్ట్రక్చర్ కమిటీ నాయకుడు బొడ్డు అశోక్, షేక్ హుస్సేన్, ఏరియా మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి గడిపే చక్రపాణి, కుడుదుల శంకర్, కోలా నాగేంద్రబాబు, సీనియర్ నాయకుడు కొలిపాక నర్సింగరావు, పిట్ సెక్రటరీలు సోతుకు సమ్మయ్య, పొనగంటి కృష్ణ, చిన్న మల్లయ్య, అసిస్టెంట్ పిట్ నాయకులు గంధం సంతోష్, బండి వెంకటేష్, కిష్టయ్య, సమ్మయ్య, సాయి, యూనస్, మహేష్, శ్రీనివాస్, ప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.
ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, జేబీసీసీఐ-11 స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ బి. జనక్ ప్రసాద్ సీఈఆర్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన క్రీడాకారుల ప్యానెల్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో క్లబ్ అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. భూపాలపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారుల విశ్వాసానికి అనుగుణంగా క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు.