Take a fresh look at your lifestyle.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు….

0 1,077

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి మాదిగ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు, దొరల దౌర్జన్యాలను రజాకార్ల ఆగడాలను వ్యతిరేకంగా ఎదిరించి నిలిచిన తెలంగాణ వీరవనిత. మహిళా లోకానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 26 న జయంతి ఉత్సవాలు పట్టణ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బుట్ట వెంకట రాములు, గర్గుల బాలరాజ్, కొత్తల యాదగిరి, జి సాయికుమార్, మాచారెడ్డి మండల అధ్యక్షులు రమేష్, రామ్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు బాణాపురం లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.