Take a fresh look at your lifestyle.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’.

0 4

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’.
కొమరం భీం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, కొమరం భీం సర్కిల్ గా నామకరణం చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
ఆదివాసీ జెండాను ఆవిష్కరించిన కొమరం బుచ్చయ్య, కుంజ సమ్మయ్య.
ఆదివాసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి )
భద్రాద్రి-కొత్తగూడెం,ఆగస్టు 9:ఆదివాసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లేందు క్రాస్ రోడ్డులో కొమరం భీం సర్కిల్ వద్ద ఆదివారం ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవ’ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై, గిరిజన విప్లవ వీరుడు కొమరం భీం పునర్నిర్మిత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమరం బుచ్చయ్య, కుంజ సమ్మయ్యలు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ… ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, ఆత్మగౌరవ పోరాటాలకు కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “జల్, జంగల్, జమీన్” సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన అమరవీరుడు కొమరం భీం ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గిరిజనుల చట్టబద్ధమైన హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ వేడుకల్లో ఆదివాసీ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు, ఆదివాసీ సోదరసోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.