Take a fresh look at your lifestyle.

గ్రామీణ బంద్ ను విజయవంతం చేయండి….

0 1,848

గ్రామీణ బంద్ ను విజయవంతం చేయండి

  • దేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయండి
  • కిసాన్ నగర్ లో పోస్టర్లు ఆవిష్కరణ

బాల్కొండ,  ఫిబ్రవరి 13 ( లోకంతీరు) : కేంద్రం లో ఉన్న బిజెపి, కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతికటిద్దాం మోడీ ప్రభుత్వ వైఫల్యలపై చార్జిసీటు ప్రకటిద్దాం అని ప్రభుత్వ వ్యతిరేక విధాలు నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన బంద్ చేయాలని భారత కార్మిక సంఘల సమాఖ్య ఐఎఫ్టియు ఐ ఎఫ్ టీ యు ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని కిషన్ నగర్ లో సిజె బీడీ కంపెనీ సెంటర్ లో దేశ వ్యాప్త కార్మిక సమ్మె వల్ పోస్టర్ లను ఆవిష్కరించడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఏం,ముత్తన్న,

మాట్లాడుతూ

 

కేంద్ర బిజెపి కార్పొరేట్ మత్తుతో విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ విఫలాలను ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటింటికి చేయాలని 2024 ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్ సంఘాలు నిర్ణయం తీసుకుంది, తెలంగాణ రాష్ట్ర కార్మికులు, గ్రామీణ బంద్ నీ జయప్రదం చేయాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు .

కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చే పది సంవత్సరాలు పూర్తయింది ఆయన రైతాంగ కార్మిక ప్రజల సమస్యలను పరిష్కరించాలేదు, భారత్ వెలిగిపోతుంది, అచ్చా దిన్ అయెగ ,విశ్వగురు, ఆత్మనిర్బర్ భారత్, మేకింగ్ ఇండియా, మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఏమి జరగలేదు.

బిజెపి అధికారంలో వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది, నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయాయి ప్రపంచంలోని 125 దేశాల్లో, ఆకలితో భారత్ 111 వ స్థానంలో ఉంది.

మానవ అభివృద్ధి దేశాల్లో. 191 ఇండియా 132వ స్థానం ఉంది.

ఇలాంటి అనేక సమస్యలు ఇండియాలో తలెత్తుతున్నాయి కాబట్టి మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలమైతున్నాయి కాబట్టి వీటిని ప్రజలు వ్యతిరేకించాలని ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రం కార్బన్డేట్లకు అమ్మేస్తుందని వీటిని మనం వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు.

అందుకే ఈనెల 16వ తేదీన దేశవ్యాప్త బందును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో నజీర్,ఏం డి పయస్, రాజేశ్వర్,ఉమేష్,వినోద్, ఇత్యస్,, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.