Take a fresh look at your lifestyle.

సింగరేణి మారుపేరు, విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోరుతూ కొనసాగుతున్న ఆమరణ దీక్ష.

0 3

సింగరేణి మారుపేరు, విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోరుతూ కొనసాగుతున్న ఆమరణ దీక్ష.

దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 15: సింగరేణిలో మారుపేరు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించి అర్హులైన బాధితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ బాధితుల సమస్యలను సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆమరణ దీక్ష చేస్తున్న వారి సమస్యలపై వెంటనే స్పందించి, న్యాయం చేసి దీక్షను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మారుపేరు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారం కోసం గత కొంతకాలంగా సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధర్నాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, శాంతియుత నిరసనలు వంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహించినా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

‘ఉద్యోగాలు కల్పిస్తేనే దీక్ష విరమిస్తాం’

ఆమరణ దీక్షలో పాల్గొన్న బాధితులు ఉదయం నుంచి నీరు కూడా తీసుకోకుండా నిరసన కొనసాగిస్తూ, తమకు ఉద్యోగాలు కల్పించే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న మారుపేరు, విజిలెన్స్ పెండింగ్ బాధితులకు వెంటనే న్యాయం చేసి, అర్హులైన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీక్షలో మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్, దనాడ రాజు, ఓం ప్రకాష్, కొలిపాక అన్వేష్ (వైస్ ప్రెసిడెంట్), భూపాలపల్లి రాజయ్య, పిట్టల అనిల్ కుమార్ (మందమరి వైస్ ప్రెసిడెంట్), ఉస్మాన్, ఆకుల సాయి కిరణ్, కొమరమ్మ, అజ్మీర నరేష్, కే. అశోక్, దిష్ బాబు, షేక్ బాబర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బాధితులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.