
కొత్తగూడెంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం పట్టణంలో పలు చోట్ల శనివారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించి, తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు శాంతిరామ్, బండి నరసయ్య, దాచేపల్లి వెంకటేశ్వర్లు, హాసన్, వెంగల కనకయ్య, గౌతమ్ చంద్ ఫారేఖ్, కందుల వెంకటేశ్వర్లు, లోగాని శ్రీనివాస్, కరీమ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తగూడెం సూర్యా ప్యాలెస్ సెంటర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్, రత్నాకర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కూలీలైన్‌లోని వీరభద్రియ సంఘం కార్యాలయంలోనూ సంఘం పెద్దలు జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.