Take a fresh look at your lifestyle.

వెంకటాయపాలెంలో వైఎస్ఆర్‌కు ఘన నివాళి.

0 2

వైఎస్ఆర్‌కు ఘన నివాళి.
వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్‌ నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్‌ 2: ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్ఆర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం రూరల్‌ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వైఎస్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ఆర్‌ ప్రజా సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్‌ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.