Take a fresh look at your lifestyle.

టేకులపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు.

0 2

టేకులపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు.
ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
టేకులపల్లి, సెప్టెంబర్ 8: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలను టేకులపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. తన జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అభిమానమే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఇల్లందు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.