Take a fresh look at your lifestyle.

INTUC విస్తృత స్థాయి సమావేశంలో భూపాలపల్లి నాయకులు.

0 2

INTUC విస్తృత స్థాయి సమావేశంలో భూపాలపల్లి నాయకులు.

కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘాన్ని బలోపేతం చేయాలి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 6: గోదావరిఖని ఏరియాలోని సాయి లీలా బ్యాంక్వెట్ హాల్‌లో ఆదివారం INTUC అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (SCMLU)- ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో భూపాలపల్లి ఏరియా INTUC నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా INTUC సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, JBCCI-XI స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యుడు డా. బి. జనక్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. భూపాలపల్లి ఏరియా INTUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి, INTUC సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు జోగా బుచ్చయ్య, ఏ.రఘుపతి రెడ్డి, SCMLU-INTUC మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దినేని శేషారత్నం, INTUC జనరల్ సెక్రటరీ పసునూటి  రాజేందర్, ఏరియా స్ట్రక్చర్ కమిటీ నాయకులు బొడ్డు అశోక్, షేక్ హుస్సేన్ తదితరులు డా. జనక్ ప్రసాద్‌ను కలిశారు.

ఈ సందర్భంగా బేతెల్లి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ,  సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి INTUC నిరంతరం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా మెడికల్ బోర్డు ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడం, అన్‌ఫిట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం, కార్మికులకు సొంత ఇంటి కలను సాకారం చేయడం, మారుపేర్ల మార్పు సమస్యలను పరిష్కరించడం, సింగరేణికి CPSU హోదా కల్పించడం, నూతన గనులను ప్రారంభించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డా. జనక్ ప్రసాద్ సూచించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూనే యూనియన్‌ను మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో INTUC బ్రాంచ్ నాయకులు కుడుదుల శంకర్, రవికిరణ్, భూపాలపల్లి ఏరియా SCMLU-INTUC మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి గడిపే చక్రపాణి, KTK-5 ఇంక్లైన్ INTUC వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేందర్, KTK-1 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సోతుకు సమ్మయ్య, KTK-6 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ చిరుత లక్ష్మీనారాయణ, KTK-8 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సంగం శ్రీనివాస్, KTK-OC-2 పిట్ సెక్రటరీ పొనగంటి కృష్ణ, S&P-C పిట్ సెక్రటరీ కసూరి సంపత్, సివిల్ డిపార్ట్‌మెంట్ పిట్ సెక్రటరీ చిన్న మల్లయ్య, ఏరియా వర్క్‌షాప్ పిట్ సెక్రటరీ కూతురు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.