కోటగిరి మండలం లో దొంగల బీభత్సం
కోటగిరి, జనవరి 21( లోకం తీరు ): ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అర్థరాత్రి దొంగతనం జరిగిన సంఘట న కోటగిరి మండలం లింగాపుర్ గ్రామంలో చోటు చేసుకొంది.శనివారం అర్థరాత్రి లింగాపూర్ గ్రామాని కి చెందిన బయ్యగారి నవీన్ ఇంట్లో లేని సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి తాళం పగులగొట్టి తులం 3 మసాలు విలువ గల బంగారు రింగులు అలాగే 8 తులాల విలువ గలిగి న వేండికడియాలు ఆపహరించుకెల్లారు.ఈ ఘట నపై కోటగిరి ఎస్.ఐ సందీప్ కుమార్ భాదితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
