రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
– పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ
– అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చ్ 12 ( లోకంతీరు ) : భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాబోయే పార్లమెంటు ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హౌస్ ఆఫ్ పార్లమెంట్ కు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్ల పై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్వీప్ అధికారి వెంకటేష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుసూదన్ రావు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ..! ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలలో అమలు చేయాలని, దానికి తగిన విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన మేర పోలింగ్ సిబ్బంది సన్నద్ధం చేసుకోవాలని, ఇటీవల జరిగిన బదిలీల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే వివిధ బృందాల్లోని సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేలా కార్యాచరణరూపొందించాలని, ఈవీఎం యంత్రాల మొదటి స్థాయి చెకింగ్ నివేదికల సమర్పించాలని, 85 సంవత్సరాల పై వయస్సు గల ఓటర్ల పోలింగ్ పాల్గొనే ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగులను మ్యాపింగ్ చేసే పోలింగ్ నాడు వారికి అవసరమైన రవాణా సదుపాయాల కల్పించాలని, నామినేషన్ దాఖలు ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని అన్నారు. జిల్లాలలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ల పై పూర్తిస్థాయి కంట్రోల్ ఉండాలని, ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తం ప్రచురించే ప్రతి ఫ్లెక్సీ కరపత్రాలు ముందస్తుగా మన అనుమతి తీసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నిరంతరం పరిశీలించాలని, సామాజిక మాధ్యమాలలో వచ్చే అపోహలను ఏర్పాటు కప్పుల నివృత్తి చేయాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులను సకాలంలో తప్పులు లేకుండా నమోదు చేసి సమర్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ టర్న్ ఔట్ పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్బులు ప్రారంభించి ఓటు ప్రాముఖ్యత గురించి వివరించాలని, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని ప్రముఖులను గుర్తించి వారిచే ఓటు ప్రాముఖ్యత పై అవగాహన వీడియోలు రూపొందించాలని అన్నారు.
ఓటు ప్రాముఖ్యత ప్రజలకు చేరే విధంగా వినూత్న రీతిలో కార్యక్రమాలను అమలు చేయాలని, వివిధ వర్గాలకు చెందిన వారిని తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ అవగాహన కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రచారం కల్పించాలని అన్నారు.
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను ఎన్నికల కమిషన్ మార్గదర్శకల్ల ప్రకారం త్వరగా పరిష్కరించాలని సూచించారు. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల నూతన ఓటర్ల నమోదు పై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు.
దివ్యాంగులు ,మహిళలు, థర్డ్ జెండర్, సెక్స్ వర్కర్లు, పి.వి.టి.జి (పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్) సభ్యులందరికీ తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. పోలింగ్ కేంద్రాల లోకేషన్ , పేరు మార్పుల పై అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని , ఓటర్ల సంఖ్య ప్రకారం అవసరమైన మేర అదనపు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలు , ఆక్సిలరీ పరిధిలో ఓటు వేసే ఓటర్లకు ఆహ్వాన పత్రికలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ జాబితా సవరణ లో భాగంగా మరణించిన వ్యక్తుల , ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లిన వారి ఓటు వివరాలు నిబంధనల ప్రకారం తొలగించాలని అన్నారు.
ఓటరు జాబితాలో వచ్చే మార్పుల పై ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ వారికి సమాచారం అందించాలని, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశపు మినట్స్ కాపీలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నూతనంగా మంజూరు చేసిన ఓటర్ కార్డు వివరాలను వెంటనే సంబంధిత ప్రింటర్లకు అందజేయాలని అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. విఐపి ల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేవిధంగా చూడాలన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని సూచించారు. ఓటింగ్ శాతం గతంలో తక్కువ అయిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, తక్కువ కావడానికి గల కారణాలను తెలుసుకోవాలని కోరారు.