Take a fresh look at your lifestyle.

నాతో కలిసి పని చేసే కార్యకర్తలకు అండగా ఉంటాను..!

0 338

నాతో కలిసి పని చేసే కార్యకర్తలకు అండగా ఉంటాను..!

– జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్

కామారెడ్డి జిల్లా, జనవరి 24 (లోకం తీరు) : నన్ను కలిసిన ప్రతి కార్యకర్తకు మేలు చేశానని పార్టీ అన్న కార్యకర్త అన్న వారి కష్టాల్లో పాలుపంచుకోవడం తన బాధ్యతని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ నగర్ రామారెడ్డి మండలాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు కష్టకాలంలో కార్యకర్తలతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయం చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తల నుంచి కూడా నిధులు తెచ్చి సమస్యలను పరిష్కరించానన్నారు. కేసీఆర్ సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పేద ప్రజలకు మేలు చేయడం దేయంగా పనిచేశానన్నారు ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే రోడ్లను నిర్మించడం జరిగిందని వివరించారు.

అంతేకాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద 78 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. 1200 కోట్లతో బోధన్ బీదర్ రైల్వే లైన్ మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా కరోనా సమయంలో జహీరాబాద్ నియోజకవర్గం లోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి 20 లక్షలతో టాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులు పారిశ్రామికవేత్తల సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని కొంత ప్రచారం చేసుకోవడంలో వెనుకబడ్డామన్నారు. తన కార్యాలయానికి వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితేనే ప్రజలైతే నేమి వారికి మేలు చేశానే తప్ప ఏనాడు దూరం చేసుకోలేదన్నారు ప్రజలు వాస్తవాలు గుర్తుంచుకొని మూడోసారి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని అందుకు కార్యకర్తలు కష్టపడాలన్నారు .

ఏ ఇబ్బంది ఉన్న తన సమాచారం ఇస్తే తప్పకుండా పరిష్కారాన్ని కృషి చేస్తానని తనతో కాకపోతే పార్టీ పెద్దలతో మాట్లాడి తగు న్యాయం చేస్తానన్నారు కార్యకర్తలను ఏనాడు దూరం చేసుకోలేదని ఎవరు అపోపడవద్దని తనను స్వయంగా కలిస్తే వారి ఇబ్బందులు ఉంటే అందులో పాలుపంచుకుంటానన్నారు సదాశివనగర్ మండలంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి పద్మ వాడి చౌరస్తాలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశానన్నారు అలాగే తన ఎంపీ నిధుల నుంచి అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు ఐమాక్స్ లైట్లు ఏర్పడడానికి కృషి చేశానన్నారు.ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద 30 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగిందన్నారు వికలాంగుల కోసం బ్యాటరీ సైకిల్ ఇప్పించడం జరిగింది అని వివరించారు సభ అధ్యక్షత వహించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు సమన్వయంతో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపించాలన్నారు. నాయకులు ఇప్పటికైనా సమన్వయంతో ఉండి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని అలాంటి వ్యక్తిని ఎన్నికల్లో ఓడించిన ప్రజలు ఇప్పుడు ఆలోచనలు పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారన్నారు. వారిచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు .ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.