గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశానికి హాజరు కావాలి

కామారెడ్డి జిల్లా/ భిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని బిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాలలో రానున్న సెప్టెంబర్ 7 వ తేదీన వినాయక చవితి సందర్భంగా అన్ని గ్రామాల వినాయక మండప నిర్వాహకులు సెప్టెంబర్ 2 తేదీన ఉదయం 10 గంటలకు సోమవారం భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించే శాంతి సమావేశానికి హాజరుకావాలని గురువారం పత్రిక సమావేశంలో ఎస్సై సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండప నిర్వాహకులు ఇద్దరు చొప్పున హాజరుకావాలని, హాజరుకాని సభ్యులకు మండపాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నత అధికారులు హాజరవుతారన్నారు.