ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు
– తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు : వెంకటేష్ గౌడ్
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జూలై 30 (లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మంగళవారం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియ లో భాగంగా రూ.1.50 లక్షలు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారని,మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైందని,
మాట ఇచ్చిన విధంగా ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం రూ.31వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయలేదని, ఆ ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కడం గర్వంగా ఉందన్నారు.
అన్నదాతలు బాగుండాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ వెల్లడించారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు జావీద్, యూనుస్,కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.