Take a fresh look at your lifestyle.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదు.

0 1,669

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదు.

  • మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి.

  • నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల పరిశీలన.

  • గ్రామస్థాయిలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం.

1524 

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 01 ( లోకం తీరు ) :  ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదనీ.పంట పొలాలు చూస్తే పచ్చగున్నాయి కాలువలు చూస్తే పూడిపోయినాయని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు.గురువారం కోటగిరి పొతంగల్ మండలంలోని ఎత్తొండ,యాద్గార్పూర్,వల్బాపూర్ గ్రామాలలోని నిజాం సాగర్ డీ 28/4 డిస్ట్రిబ్యుటర్ కాల్వలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధుల తో కలిసి ఆయన పరిశీలించా రు.అనంతర కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి పునర్నిర్మాణంలో భాగంగా యాద్గర్పూర్, వల్బాపూర్ గ్రామాలలో నూతన కార్యవర్గాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎన్నికైన నూతన అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.తదనంతరం యాద్గార్పూర్ గ్రామంలో పదవి విరమణ పొందుతున్న సర్పంచ్ మిర్జాపూర్ విజయ సాయిన్న దంపతులకు ఏనుగు రవీందర్ రెడ్డి ఘనంగా సన్మానించి వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కోటగిరి, పోతంగల్ మండలాలలోని కాలువలు అద్వాన స్థితిలో ఉన్నాయని తద్వారా రైతులు తమ సొంత డబ్బులతో పంట కాలువలకు పూడికలు తీసుకుంటున్నారని అన్నారు. రైతు బిడ్డ అని చెప్పుకునే పోచారం రైతులకు చేసిన మేలు ఇదేనా అని ప్రశ్నించారు. రైతులకు నిజమైన లబ్ధి జరిగిన ప్పుడే పోచారం రైతుబిడ్డ అవుతాడని ఆరోపించారు. రైతులకు నిజమైన లబ్ధి జరిగి నప్పుడే అది రైతు రాజ్యం అవుతుందని తెలిపారు.రైతుల కాలువలు పరిశుభ్రమై, పుష్కలంగా నీరు పారేంత వరకు తాను విశ్రమించేదే లేదని అన్నారు.మంచి పనులు చేసే వారికి ప్రజాసేవలో పదవు లతో సంబంధం లేదని.రాను న్న రోజుల్లో ఇందిరమ్మ కమిటీలతో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ రాజ్యాన్ని పునరావృతం చేసి నియోజక వర్గంలోనీ అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నడుం బిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, పోతంగల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ పుప్పాల శంకర్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్,రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు యలమంచి లి శ్రీనివాస్ రావు,డిసిసి డెలిగేట్ సభ్యులు కోటగిరి ఎంపిటిసి కొట్టం మనోహర్, బాన్సువాడ నియోజకవర్గ స్థాయితో పాటుగా ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.