బాలుడు కిడ్నాప్ కు యత్నించిన మహిళ
గుర్తించి పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్) : ఆర్మూర్ బస్టాండ్ నుండి ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి ఎత్తినచిన మహిళను పట్టుకొని ప్రయాణికులు కమ్మర్ పల్లి పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి.మెండోరా మండల కేంద్రానికి చెందిన జిల్లాపల్లి గంగాధర్ ఆదివారం ఉదయం తన భార్య తిరుమల, కొడుకు గగన్ సిద్ధార్థ తేజ్, కూతురుతో కలిసి ఆర్మూర్ మండలం దేగాం లో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. గంగాధర్ భీంగల్ మండలం బడా భీంగల్ లో లైన్మెన్ గా పనిచేస్తున్నారు.