Take a fresh look at your lifestyle.

కామారెడ్డి రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.రామన్

0 1,783

కామారెడ్డి రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.రామన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బుధవారం ఎస్ రామన్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇదే జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలో సిఐగా పనిచేసి బదిలీపై హైదరాబాద్ హెడ్ కోటర్ కు వెళ్లారు. తదుపరి కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రామన్ ను నియమించారు. అనంతరం సిఐ రామన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం పోలీసులకు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.కామారెడ్డి రూరల్ సిఐ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన రామన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.