ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ,ఈ కార్యక్రమంలో ఎబివిపి కామారెడ్డి పట్టణ కార్యదర్శి చరణ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న ఆడ బిడ్డల పైన జరిగే ఆగాయిత్యాలు ఆగడంలేదని అన్నారు,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి విద్యార్థినులు, ఒకే గదిలో ఉంటున్న భవ్యశ్రీ వైష్ణవి శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. వీరి బలవన్మరణానికి కారణమైనటువంటి వార్డెన్ ని సస్పెండ్ చేయాలి, మరియు నిందితుడు ఆటో డ్రైవర్ ఆంజనేయులు ని అదుపులోకి తీస్కొని చట్టపరమైన శిక్ష వెయ్యాలని, డిమాండ్ చేశారు, ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చెటని అన్నారు.
ప్రభుత్వాలు మారుతున్న అమాయకులైనటువంటి మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదని ఏబీవీపీ వాపోయింది భాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఏబీవీపీ ఉద్యమం ఆపదని హేచ్చరించారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో భద్రత వైఫల్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సంఘటనతోనైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని సంక్షేమ హాస్టల్లో బలోపేతం చేస్తూ విద్యార్థులకు రక్షణ ఉండాలని వారు అన్నారు .ఈ కార్యక్రమం లో జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రత్యూష , రోహిత్ నవీన్ మానస సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.