Take a fresh look at your lifestyle.

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి…..

0 1,245

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి 

– నియోజకవర్గ ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే

– తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని కావున ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలు నీవస ఉండే ప్రజలకు కావలసిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను గుర్తించి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలలో ఆవస కేంద్రంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో చెరువులలో చేపలు పట్టడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని విపత్కరణ పరిస్థితి నెలకొంటే సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులకు, పోలీసు శాఖ, ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ప్రజలకు ఎలాంటి బందులుంటే ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తన ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అందించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితిని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.