దివ్యాంగుల ఉద్యోగుల డైరీ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.

కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర సంఘ డైరీని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, డిఇవో రాజు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ఉద్యోగ సంఘ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగుల ఉద్యోగుల రాష్ట్ర సంఘ నాయకుల పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నాయని ఏ ప్రభుత్వం కూడా పరిష్కరించలేదని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాణాల నరేష్ రెడ్డి, కోశాధికారి చిందం సాయిలు, ఉపాధ్యక్షులు బి భూమయ్య, ఎండి అజ్జు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.