Take a fresh look at your lifestyle.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం…

0 1,369

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

రాజంపేట కామారెడ్డి, మార్చ్ 12 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గోండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణచందర్ రావు మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు మంచిగా చదువుకొని, మంచి మార్కులు సాధించి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిఈటి భాస్కర్ రెడ్డి, జగన్నాథ శర్మ , బాల్ రెడ్డి, వెంకట్ , వెంకటేష్, బల్ల శ్రీనివాస్, సరస్వతి, జ్యోతి, ఎస్ఎంసి మాజీ చైర్మన్ బాల నరసింహులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.