Take a fresh look at your lifestyle.

సేవాలాల్ గిరిజనుల జాతికి ఆదర్శం….

0 1,471

సేవాలాల్ గిరిజనుల జాతికి ఆదర్శం

– సేవాలాల్ కు చిన్నతనం నుండే సేవా గుణం

– సేవాలాల్ ప్రజల మేలు కోసం ఉద్యమాలు చేశారు.

– ఆదర్శవంతమైన జీవితం అందరికీ పంచారు.

– సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 12 ( లోకంతీరు ) :  లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్,లంబాడీలకు సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శం స్ఫూర్తిదాయకం కావాలని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేకంగా నిర్వహించిన భోగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే అన్నారు.సంచార జాతులుగా తిరుగుతూ పాలకులకు బానిసలుగా వెట్టి చాకిరి గురైయిన లంబాడీలను ఐక్యం చేయడంలో సేవాలాల్ చేసిన కృషి అనితర సాధ్యమన్నారు. సంచర జీవనానికి స్వప్తి పలికేల తండాలను నివాసాలుగా ఏర్పాటు చేసుకొని బానిస బతుకులకు విముక్తి కల్పించిన మహా నేత సేవాలాల్ అని కొనియాడారు. మూడోనమ్మకాలు, ఆజ్ఞానం మద్యపానంపై చైతన్య పరుస్తూ లంబాడి జాతికి యుగ పురుషుడిగా ఆరాధ్యదైవంగా వెలుగొండదని అన్నారు. యువత చెడు వ్యాసాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలన్నారు. తండాలలో సీసీ రోడ్డు, విద్యుత్, త్రాగునీరు,ఎలా ఏ సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలన్నారు.ఎల్లారెడ్డి గిరిజన బాలిక సంక్షేమ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణానికి రూ.9లక్షల90వేల మంజూరు చేశారు. బంజారుల అభివృద్ధితో పాటు, అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. సేవలల్ జయంతిని ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు నేనావత్ బద్యా నాయక్    మాట్లాడుతూ..సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది వేసి అచరించిచూపారని తెలిపారు. బంజారాలు అనాడు రాజుల కాలం నుండి బ్రిటీష్‌కాలం వరకు అయా రాజ్యాలకు అవసరమైనయుద్ద సామాగ్రిని చేరవేస్తూసంచార జీవనం సాగిస్తూ ఉండే వారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బోదనల వల్ల బంజారా జాతిపురోగమించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో మన్నే ప్రభాకర్, జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బద్యానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పవర్ యశ్వంత్ రావు, వివిధ మండలాల తహసీల్దార్లు,ఎంపీపీలు,జడ్పీటీసీలు, వివిధ మండలాల బంజారా సంఘం అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.