సెర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజిరెడ్డి
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : తెలంగాణ సెర్ఫ్ (ఎల్- 1), (ఎల్ -2) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా గడ్డం రాజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా గొర్రె రాములు, కార్యదర్శిగా గంగ రాజం, సహాయ కార్యదర్శిగా అంజా గౌడ్, కోశాధికారిగా ఆర్ రామచంద్ర గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు m సాయి రెడ్డి తెలిపారు. ఎన్నికైన ఉద్యోగులతో సెర్ఫ్ ప్రధాన సలహాదారుడు దత్తు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పలువురు సెర్ఫు ఉద్యోగ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు.