Take a fresh look at your lifestyle.

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం….

0 1,678

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

కామారెడ్డి జిల్లా, మార్చి15 ( లోకంతీరు ) : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడం, కృత్రిమ మేధస్సు వల్ల స్వతహాగా ఆలోచించే విధానం సన్నగిల్లడంతో పాటు మోసాలు ఎక్కువగా జరిగే అవకాశముందని, అవసరం మేర సాంకేతికతను వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరములో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆన్ లైన్ లో గ్యాంబ్లింగ్ వంటి వివిధ యాప్ ల ద్వారా కుటుంబాలు నాశనమవుతూ, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని, యువత అప్రమత్తంగా యాప్ లను ఉపయోగించాలని హితవు చెప్పారు. దైనందిన జీవితంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్, మాలి లెవెల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, తదితర విధానాల ద్వారా వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్న వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం 2019 లో వినియోగదారుల రక్షణ చట్టం తెచ్చిందన్నారు. ప్రధానంగా తూనికలు, కోలతలలో మోసాలు, కల్తీ, నాణ్యత లేని వస్తువులు, విక్రయించడం బ్లాక్ మార్కెటింగ్ చేసి అధిక ధరలకు విక్రయిచడం వల్ల మోసపోతున్నారన్నారు. ఈ చట్టం ద్వారా నష్టపోతే పరిహారం పొందే హక్కుతో పాటు వస్తువు ఎంపిక చేసుకునే హక్కు, భద్రత, సమాచారం, విద్య, ఆరోగ్య హక్కులు పొందవచ్చన్నారు. వినియోగదారుడు వస్తువు కొనేముందు నాణ్యత, ఎక్స్పైరీ తేదీ, గరిష్ట ధర, వంటివి పరిశీలించి రసీదు తీసుకోవాలని సూచించారు. 

డీఎస్ ఓ మల్లికార్జున్ బాబు, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఉద్యానవన అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ నేడు తినే ఆహారం తో పాటు ప్రతి వస్తువు కల్తీ అగుచున్నదని, కొన్ని చిట్కాలు పాటిస్తే నకిలీవో కావో తెలుసుకొని అప్రమత్తం కావచ్చని అన్నారు. నేడు గూగుల్, మోనోపాలీగా ఆన్ లైన్ రంగాన్ని శాసిస్తున్నాడని, మన ప్రభుత్వం రూపొందించిన ఓ ఎన్ డి సి ప్లాట్ ఫారం, యర్డి యాప్ ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా అందరు మన దేశ ఉత్పత్తులను ఉపయోగిస్తే డాలరుతో సమానంగా మన రూపాయి వృద్దిచెంది దేశం ఎంతో పురోగమిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బావయ్య, పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు రఘునందన్, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, వినియోగదారుల ఫోరమ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.