ఆర్ముర్ వెటర్నరీ ఆసుపత్రిలో ఉచితముగా రేబీస్ టీకాలు…..

ఆర్ముర్ , జనవరి 29 ( లోకం తీరు ) : ఈ రోజు Animal welfare fortnight సందర్భంగా ఆర్మూర్ ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో ఉచితముగా రేబీస్ టీకాలు వేయడం జరిగింది. కుక్క కాటుతో వ్యాపించే ప్రాణాంతక రేబిస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డా. జియాఉద్దీన్ సూచించారు.ఈ క్రమంలోనే రేబిస్ వ్యాధి లక్షణాలు , అది వ్యాప్తి చెందే విదానం , వ్యాప్తి అంశాలపై జిల్లా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఈ వ్యాధి కుక్కల నుండి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుందని వివరించడం జరిగింది.అలాగే జంతు సంరక్షణ చట్టం గురించి,వాటి నిబంధనల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 42 కుక్కలకు టీకాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డా. జియాఉద్దీన్,వి.ఎ రోజాశ్రీ,స్టాఫ్ మల్లేష్,శోభ,రైతులు పాల్గొన్నారు.
రేబిస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే…..
‘రాబోడ’ కుటుంబానికి చెందిన ‘లిసా’ వైరస్ కారణంగా రేబిస్ వ్యాధి వ్యాపిస్తుంది పెంపుడు కుక్కలు వీధి కుక్కలు ఆవులు గొర్రెలు, పందులు గుర్రాలు కనిపిస్తుంది వ్యాధి సోకిన కుక్క మరొక కుక్కను ఇతర జంతువును మనిషిని కరిచినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. 90 శాతం కుక్కల వల్లనే మనుషులకు ఈ వైరస్ సోకుతుంది కుక్క కాటు వేయగానే వైరస్ శరీరంలో ప్రవేశించి కండరాలలో వృద్ధి చెంది న్యూరో మసికులర్ స్టెండిల్ ద్వారా నాడీ వ్యవస్థకు చేరుతుంది అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తిస్తుంది సూచించారు.ప్రాణాంతకమైన ఈ రేబిస్ వ్యాధి సుఖకుండా కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించడం ఒక్కటే సరైన ప్రత్యేక మార్గం అని డా. జియాఉద్దీన్ సూచించారు.
