శాంభవి హై స్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

బాల్కొండ, జనవరి 26 (లోకం తీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.అనంతరం పాఠశాల ఫౌండర్ బొట్ల విజయలక్ష్మి జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.