Take a fresh look at your lifestyle.

మత్తు పదార్థాలు, ప్రలోభాలకు యువత గురికావద్దు…

0 1,223

మత్తు పదార్థాలు, ప్రలోభాలకు యువత గురికావద్దు

• కె యస్ . ప్రదీప్, పి వై యల్ రాష్ట్ర అధ్యక్షులు

నిజామాబాద్ నియోజకవర్గం , జులై 07 ( లోకంతీరు ) : ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది.పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ ప్రారంభ ఉపన్యాసకులుగా మాట్లాడినారు. శిక్షణా తరగతుల్లో యువజనుల కర్తవ్యాల గురించి పి వై యల్రా రాష్ట్ర అధ్యక్షులు కె యస్ . ప్రదీప్ మాట్లాడుతూ, మన చుట్టు సమాజంలో యువత కులం, మతం మత్తులో పడి ఒకరికొకరు రెస్పాన్సిబులిటీ లేకుండా ఉన్నారన్నారు. మద్యం మాదకద్రవ్యాల అలవాట్లతో యువత, ప్రజలు బానిసలుగా మునిగితేలుతున్నారన్నారు. ఒక వ్యక్తి గురించే ఆలోచన చేయలేని మానసిక ఒత్తిడికి లోనవుతూ, ఒకరికొకరు చంపుకుననే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

ఆ విధంగా ఎటువంటి కులము, మతము,మాదక ద్రవ్యాల మత్తులో ముఖ్యంగా యువత పెడదారిన పడకుండా ప్రగతిశీల ఆలోచనల వైపు రావాల్సిందిగా కోరారు. కొంతమంది స్వార్థ పూరిత ఆలోచనల వలన మత్తు పానీయాలు నీళ్ల కంటే ఎక్కువ దొరుకుతున్నాయని తెలిపారు. కట్టడి చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయలేక బానిసలుగా లోనైన వారిని ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు. అటు మద్యం మత్తు పానీయాలు అమ్మద్దు నేరం అని చెబుతూనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకాలను రెట్టింపులు చేస్తున్నారని తెలిపారు. ఈ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు యువత ప్రగతిశీల ఆలోచన వైపు నడుస్తూ సమాజంలో ప్రజలు యువత ఎదుర్కొంటున్న సమస్యల పోరాటానికి ముందు ఉండాల్సిందిగా పిలుపునిచ్చారు.

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ చెలిమెల రాజేశ్వర్ మాట్లాడుతూ, మనిషిని శాస్త్రీయంగా ఆలోచింపజేయనీయకుండా కుల,మత చాందసవాదాలను యువతలో విద్యార్థుల్లో పెంపొందించేవి మూఢనమ్మకాలన్నారు. సైన్స్ ద్వారానే ఈ సృష్టి వచ్చిందని సైన్స్ వలన నడుస్తుందని తెలిపారు. బాబాలు మూఢనమ్మకాలతో లింగాల విభూదులతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. వివిధ రకాల ఎక్స్పరిమెంట్లతో విద్యార్థులకు యువతను చైతన్యవంతం చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిశ్,నవీన్ కుమార్, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామబాద్ డివిజన్ సహాయ కార్యదర్శి సాయ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, జిల్లా కోశాధికారి డి.గంగాధర్, జిల్లా నాయకులు కిరణ్, సాయి చందు, ప్రసాద్,డప్పు గంగన్న, మహిపాల్, నసీర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.