
ఖమ్మం రైతు బజార్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 15 : ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద గల రైతుబజార్లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 44వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ, మరియు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శివరామకృష్ణ హాజరై జెండా ఎగురవేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, సమగ్ర ప్రగతి, జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రైతులందరూ తమ పంట ఉత్పత్తులను రైతుబజార్లలో అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రమణమ్మ, రాజలింగం, వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, రమ, లచ్చు, జ్యోతి, మదా రమ్మ, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.