ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్తగా వహించాలి

కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు) : సైబర్ క్రైమ్ నేరస్తులు వారి యొక్క నేర విధానాన్ని మార్చుకొని, మేము పోలీసులము, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ కొడుకు లేదా మీ తమ్ముడు పలానా కేసులో అరెస్టు అయ్యి, ఇప్పుడు మా దగ్గరనే ఉన్నాడు. మీరు వెంటనే డబ్బులు తీసుకొని రావాలి. విడిపించుకు పోవాలని చెప్పి కాల్స్ చేస్తున్నారు. అలా మన కామారెడ్డిలో కూడా ఒకరిద్దరికీ ఫోన్లు కూడా రావడం జరిగింది. అయితే అలాంటి మోసపూరిత కాల్స్ నీ ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదని, ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏమైనా వచ్చిన ఎడల వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో, లేదా మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని తెలియచేయాలని అన్నారు. ఒకవేళ వారు డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఇవ్వకూడదని తెలిపారు.అంతేగాక పోలీసు వారి యొక్క, ప్రముఖుల యొక్క ఫోటోలను వారి వాట్సాప్ ప్రొఫైల్స్ లో డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి అట్టివారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్ హెచ్ ఓ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.
మీకు ఎలాంటి సైబర్ క్రైమ్ కు సంబంధించిన విషయం తెలిసిన లేదా మీరు సైబర్ క్రైమ్ కు గురి అయిన వెంటనే డయల్ 100కి గాని లేదా 1930 నెంబర్ కి గాని ఫోన్ చేయగలరని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.