మన భూమి మన హక్కు ..ఓట్లు మనవి సీట్లు వాల్లయ్…
– భూ పోరాటంలో భాగంగా బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అబ్బగోని అశోక్ గౌడ్..

నిజామాబాద్, జూలై 28 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్లో చేపట్టిన భూ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ మరియు గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ , బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వర్గం ప్రెసిడెంట్ దండి వెంకట్ గారి ఆధ్వర్యంలో , బహుజన లెఫ్ట్ పార్టీ నిజాంబాద్ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత ఈ యొక్క భూ సదస్సు సభాధ్యక్షులుగా ఈ యొక్క మహాసభకు హాజరు కావడం జరిగింది..ఈ యొక్క సభను ఉద్దేశించి బహుజన లెఫ్ట్ పార్టీ నాయకులు, బీసీ ఉద్యమ నాయకులు అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ…
భూ పోరాటంలో భాగంగా అందరూ కలిసి పోరాడాలని, పిలుపునిచ్చారు.
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని తెలియజేశారు.
మన భూమి మన హక్కు ..
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే తమ ఓటును తమ నాయకులకు వేసుకోవాలని ఆయన తెలియజేశారు. రాబోయే స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని , నిజామాబాద్ అడ్డ ఉద్యమాల గడ్డ అని ఇక్కడ నుండి శంఖారావం పూరిస్తున్నామని అబ్బగొని అశోక్ గౌడ్ తెలియజేశారు. కామారెడ్డి లో అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట బీసీలకు స్థానిక ఎన్నికలు 42 శాతం ప్రకటిస్తామని తెలియజేశారని , కులగణన జరిపించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
బహుజన లెఫ్ట్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు గాని ఉంటే మన పనులు సులభంగా అయ్యేటివని చెప్పుకొచ్చారు.
ఓట్లు మనవి సీట్లు వాల్లయ్..
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి బడుగు బలహీన వర్గాలకు 90% పైన ఉన్నటువంటి వారికి రాజ్యాధికారం మన చేతిలో పెట్టుకొని అగ్రవర్ణాలకు ఓట్లు వేస్తే మరి మన పనుల కోసము వాళ్ళ దగ్గర చేయించాల్సిన అవసరం ఉండేది కాకపోయేది కదా అని ప్రశ్నించారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని దానిని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే పూర్తిగా సమీక్షించి ఈ యొక్క అభివృద్ధి పైన జరిగిన కుంభకోణంలో వేలకోట్లను తిరిగి జప్తు చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు వేరైనా పరిపాలన ఒకటే విధంగా ఉంటుందని పేదల యొక్క ఆశయాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని తెలియపరచారు.ఇప్పటికైనా అందరూ కలిసి రావాలని మీ యొక్క నాయకులను కాపాడుకోవాలని
అబ్బ గోని అశోక్ గౌడ్ వారికి సూచనలు ఇచ్చారు.
ఈ యొక్క భూ పోరాటంలో భాగంగా అందరూ కలిసి ఉద్యమం చేయాలని ఎవరికి భయపడే ప్రసక్తే లేదని , ఎలాంటి బెదిరింపులకు గాని పోలీస్ కేసులో గాని, ఇతర ప్రభుత్వ అధికారులకు గాని యొక్క భూ సదస్సు పైన ఎదురించి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు. అదేవిధంగా అన్ని రంగాలలో మేము మీకు అండగా ఉంటామని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.ఈ యొక్క భూ సదస్సుకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభలు విజయవంతం చేశారని అబ్బ గోని అశోక్ గౌడ్ కూడా తెలియజేశారు